
ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి అజెండా ప్రచారానికి పార్టీ కూడా కృషిచేసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. పార్టీలో ఆర్‌ఎ్‌సఎస్ నియమించే ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రామ్‌లాల్ ఈ బృందంలో కీలక సభ్యుడు. మిగతా సభ్యులు కూడా దాదాపు సంఘ్ నుంచి వచ్చినవారే ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వీరు తరచూ రాష్ట్రాలకు వెళ్లి కనీసం మూడు రోజులు గడుపుతారు. ‘నాయకత్వ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య అంతరం ఉండకూడదని అమిత షా భావిస్తున్నారు.