మేలో సిఐటియు రాష్ట్ర 14వ మహాసభ..

ఐటియు రాష్ట్ర 14వ మహాసభ మే నెలాఖరులో జరుగుతుందని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.పుణ్యవతి, ఎం.ఎ.గఫూర్‌ తెలిపారు.కార్మికో ద్యమాలను మరింత బలోపేతం చేసి కార్మికులను సంఘటితం చేసేదిశగా నూతన రాష్ట్ర రాజధాని విజయవాడలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1970లో సిఐటియు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విజయవాడలో రాష్ట్ర మహాసభ జరగనుందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలపై స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన దాడులకన్నా ఇప్పుడు మరింత పెరిగాయని గఫూర్‌ అన్నారు