పసలేని ప్రధాని ఫసల్‌ బీమా యోజన

 ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పంటల బీమా) పథకంలో ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. సామాన్య రైతుల కంటే కార్పొరేట్‌ వ్యవసాయ కంపెనీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం నూతన పంటల బీమా పథకాన్ని రూపొందించిందనే అభిప్రాయపడుతున్నారు. పంటల బీమాకు తోడు మరో ఏడు రకాల అంశాలను ఇందులో జొప్పించడంతోపాటు ప్రయివేటు బీమా కంపెనీలకు పెద్దపీట వేసిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పంట లాభనష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పకుండా రైతులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి.