బ్లాక్ బ్యాడ్జీలతో అసెంబ్లీకి YCP ఎమ్మెల్యేలు

 వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కుట్ర పూరితంగా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటుండటమేగాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తున్నందుకు నిరసన తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో సమస్యలు, అభివృద్ధిపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ మొదలు కాగానే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులకు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు.