March

పేదల ఇళ్లపట్టాల కోసం వామపక్షాల పాదయాత్ర

            అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, గాంధీనగర్‌, కార్మికనగర్‌, జ్యోతినగర్‌, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్‌ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉత్తరాంధ్రకు నీటి కరువు

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

SBI లైసరిఫ్‌-స్మార్ట్‌ఉమెన్‌ అడ్వాంటేజ్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  మహిళలకు కానుక అందించింది. 'ఎస్‌బీఐ లైసరిఫ్‌-స్మార్ట్‌ ఉమెన్‌ అడ్వాంటేజ్‌' పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. జీవితకాల పొదుపుతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్య బీమా వర్తించేలా దీనిని రూపొందించింది. హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు గర్భధారణ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. దీనిని గోల్డ్‌, ప్లాటినమ్‌ పేరుతో రెండు రకాలుగా ఎస్‌బీఐ అందిస్తోంది.

ఇదేనా జవాబుదారీతనం?

ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ చర్యలపై కాంగ్రెస్‌, వామపక్షాలు సంధించిన విమర్శనాస్త్రాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎదురు దాడికి దిగడం దారుణం. పార్లమెంటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలను కవ్వించే రీతిలో సాగింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేదిగా ప్రధాని సమాధానం వుంటుంది. కానీ, గురువారం నాటి మోడీ సమాధానం దీనికి పూర్తి భిన్నంగా వుంది. విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడూ సమాధానం కాదు.

RTI పై ఏచూరి అఫిడివిట్ దాఖలు..

 సమాచార హక్కు చట్టం పరిధి నుండి రాజకీయ పార్టీలను మినహాయించాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుఫ్రీం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేశారు.  సమాచార హక్కు చట్టం క్రింద పార్టీ కార్యకలాపాలు, ఆర్ధిక అంశాలతో పాటు అంతర్గత వివరాలు తెలపాలంటూ సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ , డెమక్రాటిక్ రైట్స్ అనే ఎన్‍జీఓ తో కలిసి కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్‍పి, సిపిఐ, ఎన్‍సిపి పార్టీలకు దరఖాస్తు చేశారు..

రాజధానిలో భూ వినియోగం..

రాజధాని ప్రాంతంలో తుది మాస్టర్‌ప్లాను విడుదల అనంతరం భూముల కేటాయింపుపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రైతులకు కేటాయించే భూమి వివరాలతోపాటు, మొత్తం నగరంలో భూమిని దేనికి ఎంతవాడుతున్నారనే విషయాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. దీనిలో రాజధాని నగరంలో ఉన్న 53676 ఎకరాలకు సంబంధించిన వినియోగంపై స్పష్టత ఇచ్చారు. దీనిలో అన్ని రకాల నివాస ప్రాంతాలకు 16031 ఎకరాలను కేటాయించారు. వాణిజ్య ప్రాంతాలకు 6135 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2714 ఎకరాల్లో లాజిస్టిక్‌ జోన్‌ ఏర్పాటు చేయనున్నారు.

మహిళలకు 33 శాతం..Ap అసెంబ్లీ

 చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అభ్యున్నతిపై సభలో చర్చ చేపట్టారు. అనంతరం మహిళలకు రిజర్లేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. 33 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సభ తీర్మానాన్ని ఆమోదించింది.

సీమలో సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ ఏది? : మధు

రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామ పక్షాలు చేపట్టిన బస్సుయాత్ర సందర్బంగా మధు మాట్లాడుతూ, రాయలసీమలో ఏటేటా రైతు ఆత్మహత్యలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హంద్రీ నీవా, గాలేరు నగరికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

6లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలిపింది. ఖాళీగా ఉన్న 6,02,325 ఉద్యోగాల్లో 5,33,081 గ్రూప్‌ ‘సీ’కి చెందినవని సిబ్బంది, ప్రజాసంబంధాలు, పింఛన్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 51,478 గ్రూప్‌ ‘బీ’, 17,766 ఉద్యోగాలు గ్రూప్‌ ‘ఏ’ అధికారుల స్థాయికి చెందినవని పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - March