
జేఎన్‌యూ క్యాంపస్‌లో భారీ యోగా శిబిరం నిర్వహించాలని బాబా రాందేవ్ యోచిస్తున్నారు. అయితే దీనికి సంబందించి తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వేదాంత, ఆయుర్వేద అంశాలపై యూనివర్సిటీలో జరిగే ఓ విద్యా సదస్సులో బాబా రాందేవ్ ప్రసంగిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై అథ్యాపకుల్లో ఒక వర్గం నుంచి జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ సదస్సుకు రాందేవ్ బాబా హాజరు కాలేదు.