March

ఎన్నికల ప్రచారం చేయను:కన్నయ్య

పశ్చిమ బెంగాల్‌, కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసే అవకాశాలు లేవని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ సూచన ప్రాయంగా చెప్పారు. 'ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోవడంలేదు. నేను ఒక విద్యార్థిని. నేను నా పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిని కావాలన్నది నా కోరిక. అయితే, అప్పుడు కూడా నా క్రియాశీలత కొనసాగుతుంది' అని కన్నయ్య పేర్కొన్నారు. 

EPF పై కేంద్రం వెనకడుగు..

2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై 60 శాతం పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి..దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 

నకిలీ వీడియోలపై కేజ్రిని కలిసిన ఏచూరి

జెఎన్‌యు ఘటనలో ప్రధాన ఆధారంగా ఢిల్లీ పోలీసులు చూపించిన నకిలీ వీడియోలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి డిమాండు చేశారు. సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ను జెడియు నాయకులు కె.సి త్యాగితో కలసి సీతారామ్‌ ఏచూరి ఢిల్లీ సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఏచూరి మాట్లాడుతూ...జెఎన్‌యు ఘటనలపై ఢిల్లీ ప్రభుత్వం తరపున విచారణ జరిపినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపామన్నారు.

లెఫ్ట్‌ తొలి జాబితాలో 116

పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను సోమవారం సిపిఐ(ఎం) విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలకు గాను 116 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు ఇక్కడ మీడియా గోష్టిలో విడుదల చేశారు. వీరిలో 16 మంది మహిళలు, మైనార్టీ కమ్యూనిటికి చెందిన వారు 25 మంది ఉన్నారు. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

కేంద్ర సాయం ఏంటో చెప్పండి

కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం ఏమిటో తెలుసు కునేందుకు దీనిపై ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్రాన్ని రాష్ట్రం ఏం కోరింది, కేంద్రం ఏమిచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రెండో పూర్తి స్థాయి బడ్జెట్‌, కనుక ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు.

బలవంతపు భూసేకరణ ఆపాలి

రాష్ట్రంలో పిసిపిఐఆర్‌ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.క్రాంతి డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమానికి భూ సేకరణ బాధితులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల భూమిని బడా కంపెనీలకు, పెట్టుబడుదారులకు దారాదత్తంచేసేందుకు పూనుకుంటోందన్నారు. నక్కపల్లి మండలంలో పిసిపిఐఆర్‌ పేరుతో చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రైతాంగం కోర్టును ఆశ్రయించారని చెప్పారు.

పేదల ఇళ్లపట్టాల కోసం వామపక్షాల పాదయాత్ర

            అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, గాంధీనగర్‌, కార్మికనగర్‌, జ్యోతినగర్‌, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్‌ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉత్తరాంధ్రకు నీటి కరువు

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

SBI లైసరిఫ్‌-స్మార్ట్‌ఉమెన్‌ అడ్వాంటేజ్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  మహిళలకు కానుక అందించింది. 'ఎస్‌బీఐ లైసరిఫ్‌-స్మార్ట్‌ ఉమెన్‌ అడ్వాంటేజ్‌' పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. జీవితకాల పొదుపుతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్య బీమా వర్తించేలా దీనిని రూపొందించింది. హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు గర్భధారణ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. దీనిని గోల్డ్‌, ప్లాటినమ్‌ పేరుతో రెండు రకాలుగా ఎస్‌బీఐ అందిస్తోంది.

Pages

Subscribe to RSS - March