
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కానుక అందించింది. 'ఎస్‌బీఐ లైసరిఫ్-స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్' పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. జీవితకాల పొదుపుతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్య బీమా వర్తించేలా దీనిని రూపొందించింది. హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు గర్భధారణ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. దీనిని గోల్డ్, ప్లాటినమ్ పేరుతో రెండు రకాలుగా ఎస్‌బీఐ అందిస్తోంది.