2020 కల్లా భారత పరిశ్రమలపై 665 కోట్లు

వివిధ ప్రభుత్వ పథకాల్లో కంపెనీ పాత్రపై చర్చించడం కోసం అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో ఛైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శుక్రవారమిక్కడ కలిశారు. 2020 కల్లా భారత అంకుర పరిశ్రమలపై 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సిస్కో ప్రకటించింది. అంతే కాకుండా 2.5 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లూ తెలిపింది.