
చిన్న పొదుపు మొత్తాల పథకాల వడ్డీరేట్లపై కోతపడింది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజెన్ల డిపాజిట్లు సహా పలు పథకాలపై చెల్లించే వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించి వేసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య కాలానికి పీపీఎఫ్‌పై వడ్డీరేటును ప్రస్తుతమున్న 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది.