
అమరావతిలో ప్రపంచ అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు, ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలు అని చంద్రబాబు అన్నారు