ఏప్రిల్‌ 2 రావాల్సిందిగా మాల్యాకు సమన్లు

తనకు మరింత గడువు ఇవ్వాలన్న విజయ్‌ మాల్యా విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మన్నించింది. దర్యాప్తు అధికారి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గడువు పెంచింది. ఏప్రిల్‌ 2న రమ్మని తాజాగా సమన్లు జారీ చేసింది. అంతక్రితం సమన్ల ప్రకారం శుక్రవారమే (ఈనెల 18న) మాల్యా హాజరుకావాల్సి ఉంది.