April

ఒక విషాదానికి తెరతీసిన తీరు

దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. కాని వేల సంఖ్యలో వలస కూలీలు ప్రతి పట్టణం లోనూ బస్‌స్టాండ్లలో కిక్కిరిసి పోయారు. లేదా రోడ్ల మీద ఉన్నారు. ఇక లాక్‌డౌన్‌కి అర్థం ఏంటి? ఈ మహమ్మారి వ్యాపించకూడదన్న లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాంతరవాసానికి బయలుదేరి ఇంతవరకూ ఈ మహమ్మారి సోకని పల్లె ప్రాంతాలకు పోతున్నారు. అక్కడేమో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా మానవ జీవితాలు విషాదం కాకూడదని లాక్‌డౌన్‌ విధిస్తే...అంతకన్న తీవ్రమైన మానవ విషాదం ఇప్పుడు కళ్లెదుట కనపడుతోంది!కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు.

విలవిల్లాడుతున్న ఆదివాసీలు

కరోనా వైరస్‌ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్‌డౌన్‌ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్‌డౌన్‌తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్‌డౌన్‌ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది.

వ్యవసాయం లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని పూర్తిగా విస్మరించింది. సర్కారు నిర్లక్ష్య పర్యవసానాలు వ్యవసాయ రంగాన్ని, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోగా కర్షకులు ఆత్మహత్యలబాట పట్టారు. ఆర్థిక మాంద్యం తోడైన ఫలితంగా పరిస్థితి మరింతగా దిగజారింది. సరిగ్గా ఇప్పుడే కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం వెనకాముందు చూడకుండా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌, కునారిల్లుతున్న వ్యవసాయ రంగంపై పిడుగుపాటైంది.

అలసత్వం, అల్పత్వం, ఆత్మ సంతృప్తి .. అనర్థం

కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్‌ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్‌ ఆల్‌లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది.

కరోనా మహమ్మారి - కఠోర వాస్తవాలు!

 ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి.

మానవతా మూర్తులు

'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం.

ఏ దేవుడూ ఏ వైరస్‌ని నిర్మూలించలేడు !

దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.

Pages

Subscribe to RSS - April