April

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాల పై విచారణ జరపాలి.

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.

110 ఎకరాల్లో 50 ఎకరాలపై అధికార పార్టీ..

విమ్స్ కు కేటాయించిన 110 ఎకరాల భూమిలో  50 ఎకరాలపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను వేశారని  వామపక్ష నేతలు చెబుతున్నారు. విమ్స్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించారు. 

మాల్యాపై ED ఏ నిర్ణయం తీసుకోనుందో..

మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయ్‌ మాల్యా ఈడీని మరింత గడువు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు రాలేనని స్పష్టం చేశారు. బ్యాంకులతో చర్చలు నడుస్తున్నాయని... తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.ఇవాళ విజయ్ మాల్యా ఈడీ ముందు హాజరుకావాల్సివుంది... కానీ హాజరు కాలేదు. తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ ముందు హాజరుకాకపోవడంతో విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, వీసా రద్దు చేసే అవకాశం ఈడీకి ఉంది. ఈడీ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి...

లోకేశ్‌ను AP కేబినెట్‌లోకి..

పరిపాలన అమరావతికి మారిన వెంటనే లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైంది. నేరుగా తీసుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో దీనికోసం భారీ వ్యూహాన్నే రూపొందించారు. టీడీపీి వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం నేతలు తొలుత ముఖ్య మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తారు. మరోవైపు దేశం శ్రేణులు లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలంటూ ప్రచారం నిర్వహిస్తాయి. ప్రజాభీష్టం మేరకే లోకేశ్‌కు పదవి వచ్చిందని పించేలా అవసరమైన కసరత్తులనీ చేస్తారని తెలిసింది.

IIT 2 లక్షలు,NIT1.25 లక్షలు..!

ఉన్నత చదువులు మరింత భారం కానున్నా యి. ఐఐటి, ఎన్‌ఐటిలతో పాటు జాతీయ విద్యా సంస్థల్లో ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ ( ఎమ్‌హెచ్‌ఆర్డీ ) నిర్ణయం తీసుకుంది. ఐఐటి బాంబే డైరెక్టర్‌ దేవాంగ్‌ ఖాకర్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ఫీజుల విధానానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ. 90 వేలుగా ఉన్న ఐఐటి ఫీజు రూ.2 లక్షలుకు పెంచగా, రూ.70 వేలుగా ఎన్‌ఐటి ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. పెంచిన ఫీజులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఎమ్‌హెచ్‌ఆర్డీ తెలిపింది. 

ఉగ్రవాదులు కాశ్మీర్‌లోనే కాదు..రాష్ట్రాల్లో కూడా

నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పాకిస్తాన్‌ విధానంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పాక్‌ విధానం గొర్రె కసాయివాడిని నమ్మిన తీరులో ఉందని దుయ్యబట్టారు. అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మన్మోహన్‌ మాట్లాడుతూ మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరాక ఉగ్రవాదులు కాశ్మీర్‌లోనే కాకుండా పంజాబ్‌ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. గత రెండేండ్లుగా వ్యవసాయ రంగం కుదేలై రైతులకు కష్టాలు మిగిల్చిందని మన్మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

306 భారతీయ విద్యార్థుల బహిష్కరణ..?

306 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. వీసా కుంభకోణాన్ని బయట పెట్టేందుకు భద్రతా సంస్థలు చేపట్టిన నకిలీ విశ్వవిద్యాలయాల శూలశోధనలో భాగంగా సదరు విద్యార్థులు తమకు తెలియకుండానే అమెరికాకు చేరారు. అలాంటి విద్యార్థులను గుర్తించామనీ, దేశబహిష్కరణ ప్రక్రియ మొదలైందని అధికారులు వెల్లడించారు. న్యూజెర్సీ నార్తర్న్‌ విశ్వవిద్యాలయంలో గుర్తించిన భారత్‌కు చెందిన 306 మంది విద్యార్థులను గుర్తించామనీ, తిప్పి పంపే ప్రక్రియలో ఉంచినట్లు యూఎస్‌ఐసీఈ అంతర్గత భద్రత దర్యాపుల అధికార ప్రతినిధి అల్విన్‌ ఫిలిప్స్‌ పేర్కొన్నారు.

పనామ పేపర్స్ లో కోనేరు మధు

ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌-ఎమార్‌ కేసును ఫిబ్రవరి, 2012లో ఈ ట్రైమెక్స్‌ కంపెనీ అధినేతపై నమోదైంది. అయితే రెండు నెలల తర్వాత మధు కోర్టు ముందు హాజరయ్యారు. అనూహ్యంగా అప్పుడే బెయిలూ లభించింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకెళ్తే లగ్జరీ భవంతి అమ్మకపు లావాదేవీల్లో రూ.138 కోట్లు మధు తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు అందినట్లు తెలుస్తోంది. ఆ డబ్డును దుబారులోని మధుకు పంపినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. అంతేగాక ఈ వ్యవహారంపై ఏప్రిల్‌9, 2013లో ఇచ్చిన వివరణను మోసాక్‌ ఫోన్సెకాకు అదే రోజున పంపినట్లు స్పష్టమైంది.

దళితుల సమస్యల పరిష్కారం కోసం..

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు.

TDP సుజనాచౌదరికి అరెస్టు వారెంట్‌..

మారిషస్‌ బ్యాంకుకు రూ. 106 కోట్ల రుణం ఎగవేత కేసుకు సంబంధించి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజి శాఖ సహాయ మంత్రి వైఎస్‌ సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో నాంపల్లి 12 వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గురువారం అరెస్టుకు ఉత్తర్వులు ఇచ్చారు. 

Pages

Subscribe to RSS - April