April

రాష్ట్ర మాతగా గోవును ప్రకటిస్తే మద్దతు:కాంగ్రెస్

 ‘రాష్ట్ర మాత’గా గోవును ప్రకటిస్తామంటే తాము అందుకు మద్దతిస్తామని గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత శంకర్‌ సింగ్‌ వాఘేలా అన్నారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గోరక్ష ఏక్తా సమితికి ఈ డిమాండ్‌ని తెరపైకి తెచ్చిందన్నారు. భాజపా ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

NTR గార్డెన్స్‌లో125 అడుగుల అంబేద్కర్

ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లోని హిల్‌ రాక్‌ వద్ద 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జరిగిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు

సిపిఎం నేత రాఘవులను అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వతీరు వివాదాస్పదమైంది. ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ వేడుకలకు మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేకపోయారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు రాఘవులును అడ్డుకున్నారు. మంత్రి శిద్దా రాఘవరావు వచ్చే వరకు ఆగాలని సూచించారు. అయినప్పటికీ రాఘవులు పోలీసులను ప్రతిఘటించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 

అంటరానితనాన్ని రూపుమాపాలి :మధు

దళితుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు రావడంతోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌గా నియమించారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించినపుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లని అన్నారు.   

కన్నయ్య సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ..

నాగ్పూర్ లో కన్నయ్య కుమార్ సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నాగ్ పూర్ నేషనల్ కాలేజీలో జరుగుతున్న సభలో కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

125 మీటర్ల జండా ప్రదర్శన

మనువాద౦కాదు-మానవత్వ౦కావాలి.........
మనువాద౦నుండి-మనదేశన్ని రక్షి౦చు కొ౦దా౦....
తిరుపతిలో అంబేత్కర్ 125వ జయంతి సందర్భంగా సిపియం ఆధ్వర్యంలో 125 మీటర్ల జాతీయ జెండా తో పురవిధుల్లో ప్రదర్శన.

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

కరకట్ట ఇళ్ళ సమస్యపై తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలి - సిపిఎం పాదయాత్రలో సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌

ఒక పక్కన అధికారుల‌తో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాల‌ని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజల‌ను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్‌. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్‌ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు.

Pages

Subscribe to RSS - April