దేశంలో ఈ లాక్‌డౌన్ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం.