విజయవాడలో కూరగాయలు, బియ్యం పంపిణీ

లాక్ డౌన్ నేపధ్యంలో విజయవాడ సింగ్ నగర్ 59, 60 వ డివిజన్ లలో సిపిఎం నాయకులు ఇంటింటికీ కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల కొరతతో పాటు, ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్ , పప్పు ధాన్యాలు రేట్లు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో విఫలమైందన్నారు. దీపం పథకం కింద ఉన్న వారికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పనుల్లేని కార్మికులకు esi నుండి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్మికులకు కేటాయించిన 1000 కోట్ల నిధులని ఎందుకు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. పి.ఎఫ్ లో యజమాని, ఉద్యోగి వాటా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ఇంతలోనే వంద మంది లోపు, 90% మందికి 15,000 లోపు జేతంవుంటేనే అంటూ మెలిక పెట్టిందన్నారు. మున్సిపల్ కార్మికులకి పెంచిన జీతాలు అమలు చేయలేదని, మూడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.. మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్ను కట్టమని ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు వాపోయారు..