కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాల్గవసారి దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగాడంబరం తప్ప ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల మెరుగుదలకు సంబంధించిన ఊసే లేదు. మూడు వారాల లాక్‌డౌన్ గడువు ముగియడంతో, దానిని మరో పందొమ్మిది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సరే. మరి ఈ లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది దినసరి వేతన కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనివారల మాటేమిటి? మోడీ ప్రసంగంలో వీరికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదు.