April

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు!

హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్థితిలో కొందరు ఉన్నారు. వారిలో ట్రంప్‌ ఒకరు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్థానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు.

జెఎన్‌యు @ కోవిడ్‌-19

కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, మెజారిటీ ప్రయోజనాలకు తలొగ్గిన అయోధ్య తీర్పు, జెఎన్‌యు హాస్టల్‌ ఫీజు పెంపు, క్యాంపస్‌లో విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల పాశవిక దాడి, ఢిల్లీ అల్లర్ల మధ్య తీసుకొచ్చిన సిఎఎ-2019 చట్టం...వంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జెఎన్‌యు తన అసమ్మతిని వ్యక్తం చేసింది. విద్యార్థులు అనేకానేక నిరసన ప్రదర్శనలు, అధికారిక విజ్ఞప్తులు చేశారు. పార్లమెంటు వరకు పాదయాత్రలు చేశారు.

వొట్టి మాటలకే పరిమితమా?

 ముఖ్యమంత్రులతో గురువారంనాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఉపసంహరణ చర్యలు ఒకే విధంగా వుండాలని కోరడం, మరోవైపు చాలామంది సి.ఎం లు ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయడం నేడున్న క్లిష్ట పరిస్థితులకు, గత పది రోజుల పరిణామాలకూ ప్రతిబింబమే! ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని ఏకపక్షంగా జనతా కర్ఫ్యూను, అనంతరం లాక్‌డౌన్‌ను ప్రకటించినా దాన్ని దేశ ప్రజలంతా మంచి స్ఫూర్తితో ఆచరించారు.

కర్నూల్లో పలు సేవా కార్యక్రమాలు..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా  కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్, అజిముద్దీన్ నగర్, చల్లా వారి వీధి, వీరు సెక్షన్ కాలని, లక్ష్మీ నగర్ తదితర వీధులలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు బ్లీచింగ్ పౌడర్ చల్లి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగస్వాములు అయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పి. నిర్మల, పి. ఎస్. రాధాకృష్ణ, జిల్లా నాయకులు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఓర్వకల్లు మండలంలో ఉచితంగా కూరగాయల పంపిణీ చేశారు.

ట్రంప్‌ రాజ్యంలో కరోనా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 'కరోనా వైరస్‌ అనేది ఒక సామాన్య ఫ్లూకి సరిసమానం' అని మొదట ప్రకటించారు. మార్చి 4న ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్‌ అనేది ఫ్లూ అంత ప్రమాదకారి కాదు. సాధారణ ఫ్లూ కారణంగా సంవత్సరానికి 27,000 నుంచి 77,000 మంది చనిపోతుంటారు' అని కూడా సెలవిచ్చారు. ఒక వారం తరువాత 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌' డాక్టర్‌ ఆంటోని ఫ్లూసీ అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ 'కరోనా వైరస్‌ వలన మరణాలు సాధారణ ఫ్లూ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయని' చెప్పారు.

పేదల ఆశలు, ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న ప్రభుత్వం

నేను కరోనా వైరస్‌ వల్ల చనిపోను. దానికన్నా ముందు ఖచ్చితంగా ఆకలితో చనిపోతాను' ఈ మాటలు పాత ఢిల్లీలో ఒక చిన్నపాటి సంఘీభావ కార్యక్రమంలో వినబడ్డాయి. కొద్దిమంది మిత్రులతో కలిసి ఒక వెయ్యి మంది అనాథలకు భోజనాలు ఏర్పాటుచేసే ప్రయత్నంలో అనేకమంది ప్రజలు వెలిబుచ్చిన ఈ ద్ణుఖపూరిత మాటలను నేను పన్నెండుసార్లకు పైగా విన్నాను. 'పెద్దనోట్ల రద్దు వలన పడిన బాధలు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధతో పోలిస్తే పెద్ద లెక్కలోని విషయమే కాద'ని ఇంకొక వ్యక్తి అన్నాడు.ఒక గంట తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయక చర్యల ప్రకటనను నేను ఆందోళనగా చదివి, నిరాశ చెందాను.

కాంతిరేఖ క్యూబా

అంధకారంలో చిక్కుకున్న ప్రపంచానికి క్యూబా ఓ కాంతిరేఖ. భయోత్పాతంలో ఉన్న మానవాళికి ఓ ధైర్యం. ఆపదలో ఉన్న దేశాలకు కొండంత అండ! ప్రపంచ పటంలో కష్టపడి వెతికితేకాని కనిపించని ఓ చిన్న దేశం క్లిష్ట సమయంలో నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా, అమెరికా వంటి అగ్రదేశం కాడి పడేసి, కరోనా (కోవిడ్‌-19) కాటుకు దిక్కుతోచక విలవిలలాడుతున్న వేళ ఆ రక్కసితో ధైర్యంగా పోరాడటమే కాకుండా అనేక దేశాలకు వైద్య బృందాలను పంపడం, ఔషధాలను సరఫరా చేయడం క్యూబాను వర్తమాన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది.

Pages

Subscribe to RSS - April