April

అంబేద్కర్‌ స్ఫూర్తితో....

నేడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి. ప్రతి ప్రజాస్వామ్యవాదీ, ప్రతి బడుగు జీవీ, ప్రతి దళితుడూ తమ కోసం జీవిత కాలమంతా పోరాడి, మరణానంతరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ మహామనీషిని స్మరిస్తారు. భక్తితో తలచుకుంటారు. ఆయన ఆశయాలకు పునరంకితమౌతారు.
భారత దేశంలో అంబేద్కర్‌ వేసిన ముద్ర ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తోందంటే పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు సైతం ఈ రోజు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తాయి. అయితే ఇదంతా మాటలకే పరిమితం అయ్యే నాటకం అని వేరే చెప్పనక్కర్లేదు. నిజంగానే ఈ పాలక వర్గాలకి అంబేద్కర్‌ మీద గౌరవం ఉంటే మన దేశంలో ఎప్పుడో కుల వివక్ష, కుల పీడన, దాడులు, అత్యాచారాలు నిలిచిపోయి ఉండాలి.

మహమ్మారి పీడిత ప్రజలు - ద్రవ్య పెట్టుబడి

ప్రస్తుత కాలపు ప్రపంచీకరణ లోని ప్రధాన వైరుధ్యాన్ని కోవిడ్‌-19 మహమ్మారి మన కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది. ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకూ, సాధారణ ప్రజల ప్రయోజనాలకూ మధ్య ఉండే మౌలిక వైరుధ్యమే ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చింది. ప్రపంచీకరణ శకం అంతటికీ ఈ వైరుధ్యమే మౌలికమైనది. ఇప్పుడది స్పష్టంగా ముందుకొచ్చింది.

వ్యవస్థలపై దాడి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఇసి) నియామక నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అత్యయిక ఆదేశం (ఆర్డినెన్స్‌) నిరంకుశ ఏకపక్ష చర్య. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, సమయం, సందర్భం లేని దుస్సాహసం. ఎస్‌ఇసి పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఎ.పి పంచాయతీరాజ్‌ చట్టం (1994) లోని సెక్షన్‌ 200ను సవరిస్తూ శుక్రవారం ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఆమోదించి గవర్నర్‌కు పంపగా, వెనువెంటనే గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ఆ రాత్రే ఆర్డినెన్స్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జీవో, మూడేళ్ల కాలపరిమితి ముగిసిందంటూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ మరో జీవో జారీ అయ్యాయి.

పేకమేడలా కూలుతున్న ప్రపంచీకరణ

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య లక్ష దాటిపోరుంది. ఇందులో డెబ్భై అయిదు వేల మంది అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, కెనడా వంటి సంపన్న దేశాలలోనే మరణించడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఆయా దేశాల అనుభవాలలో పరిపరివిధాలుగా వుండొచ్చు గాని ఒక విషయంలో మాత్రం తేడా లేదు. ఇది ప్రపంచీకరణ వైఫల్యం. నయా ఉదారవాద విధాన సంక్షోభం. అందుకు అతి తీవ్రంగా గురైన వైద్య వ్యవస్థల వైఫల్యం. ప్రపంచ ప్రజల ఆరోగ్య, ఆర్థిక, ఆహార భద్రతలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిన విషాదం. అద్దాల మేడలా మెరిసిన అంతర్జాతీయ వ్యవస్థ భూత్‌ బంగళాగా మారిపోయింది. ఏ యుద్ధం లేకుండానే శత్రువు దాడి లేకుండానే శవాల గుట్టలు పడుతున్నాయి.

కరోనా వైరాగ్యం..

సమాజం ఎప్పుడూ మారుతూ వుంటుంది. ప్రపంచంలో ఏ మార్పు అయినా ఆకాశం నుండి ఊడిపడదు. సమాజంలోనే అందుకు సంబంధించిన చోదకశక్తులు వుంటాయి. బుద్ధిజీవులు వాటిని అర్థం చేసుకొని మార్పును అంగీకరిస్తారు. మరికొందరు వాటికి మానవాతీత శక్తుల్ని అంటగట్టి ఆవేదన చెందుతారు. అనేక భయాందోళనల మధ్య, సవాలక్ష అనుమానాల మధ్య, అనేక అపనమ్మకాల మధ్య, అనంత వేదనలు, ఆవేదనల మధ్య వున్నాం మనం. లాక్‌డౌన్‌లో చాలారోజులు ఉండిపోతే వైరాగ్యం రావడం కద్దు. చాలా రకాల వైరాగ్యాలున్నాయి. ఎవరి చావుకైనా వెళ్లొచ్చినప్పుడు...ఈ పాడు జీవితం బుద్బుదప్రాయం. ఎప్పుడైనా వెళ్లిపోవాల్సిందే కదా..

కరోనాపై పోరు-రెండు వ్యవస్థల తీరు

అతి చిన్నదే, అయినా కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది. ఈ 21వ శతాబ్దంలో రెండు సామాజిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య గల తేడాను ప్రస్ఫుటంగా మరోసారి కనపరిచింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను కొన్ని దేశాలు ఎదుర్కొన్న తీరు ఈ తేడాను ప్రముఖంగా చూపిస్తోంది. ఒకవైపు-ప్రపంచం లోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికా వుంది. ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వుంది. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే ఆరోగ్య రంగం లాభాల దిశగా పయనిస్తోంది. కానీ, కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది.

Pages

Subscribe to RSS - April