April

కర్నూల్లో కూరగాయల పంపిణీ

కర్నూల్ జిల్లా ఇందిరాగాంధీ నగర్ లో ఇంటింటికి కూరగాయలు ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, పి.యస్.రాధాకృష్ణ, నగర కార్యదర్శి టి.రాముడు మరియూ నాయకులు

ఎన్నికల కమిషనర్‌ తొలగింపు న్యాయ సమ్మతమా?

తాజా పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదన్నట్లుగా జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ అమలు చేశారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌ నియామకం కూడా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా? ఏదైనా ఒకటే.

అమెరికా అంటే భయమా? సైద్ధాంతిక ఐక్యతా?

నిన్నటికి నిన్న...హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు పంపకపోతే ట్రంపు ప్రతీకారం తీర్చుకుంటా మనగానే...మోడీ ప్రభుత్వం భయపడిపోయింది. మారు మాట్లాడకుండా అమెరికాకు మందులు పంపించింది. ఈ రోజు...చైనా నుండి తమిళనాడుకు రావాల్సిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను బలవంతంగా మళ్లించేసుకున్నా నోరు మెదపలేదు. గతంలో కూడా ఇరాన్‌ నుండి ఆయిల్‌ను కొనవద్దని ఆజ్ఞ జారీ చేయగానే కొనడం ఆపివేసింది. సర్వసత్తాక సార్వభౌమాధికారం గల భారత దేశాన్ని మోడీ ప్రభుత్వం అప్రతిష్ట పాల్జేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించడం తప్ప మోడీ ప్రభుత్వం కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్‌ కిట్లను ఏర్పాటు చేయలేదు.

Pages

Subscribe to RSS - April