ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆ పని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? భాష అనేది మానవులు సృష్టించుకున్నది.