April

బిజెపియేతర రాష్ట్రాలపై మోడీ వ్యాఖ్యలు అర్ధరహితం - ముఖ్యమంత్రి మౌనం వీడాలి - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

మేధో సంపత్తి

మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో ముందుకొచ్చాడు. ఆ మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి అనేది ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా చట్టం రక్షించే మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి. యాజమాన్యాలు స్వాభావికంగా మేధో సంపత్తిపై గుత్తాధిపత్యాన్ని ఏర్పరచుకుంటాయి. 'మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది-జ్ఞానం, ఆలోచన. వాటిని సమాజానికి స్వచ్ఛందంగా అందివ్వాలి. ఇవి గాలి వలె ఉచితం' అంటాడు యుఎస్‌ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ బ్రాండీస్‌. మేధో సంపత్తి ఏ ఒక్కరిదో కాదు...అందరిదీ. విజ్ఞానం మానవాళి ఉమ్మడి సొత్తు.

పోలవరాన్ని ప్రశ్నార్థకం చేస్తే ఊరుకునేది లేదు.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ సిపిఎం

మన భాష-మన జాతి-మన ఆత్మగౌరవం

ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆ పని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? భాష అనేది మానవులు సృష్టించుకున్నది.

ఉపేక్ష ఉత్పాతం

నందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగలు ఉద్రిక్తతలతో విషాదాంతం కావడం మిక్కిలి ఆందోళనకరం. కేంద్రంలో బిజెపి వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. కర్ణాటక హుబ్బళ్లిలో మైనార్టీలు పవిత్రంగా భావించే ప్రార్ధనాస్థలంపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మార్ఫింగ్‌ ఫొటో వివాదానికి హేతువైంది. అభ్యంతరం తెలుపుతూ మైనార్టీలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశాక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడికి మద్దతుగా మతోన్మాద మూకలు రెచ్చిపోయి అత్యంత పైశాచికంగా దాడులు చేయగా పోలీసులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Pages

Subscribe to RSS - April