April

ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని రద్దు చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి సమావేశం తీర్మానం

మనువాద విధానం

కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుఇటి) ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మొన్న సోమవారం తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం పెద్ద మేల్కొలుపు. ఉన్నత విద్యనభ్యసించగోరు విద్యార్థులు అవకాశాలు కోల్పోతారన్న భయాందోళనలు ముమ్మాటికీ నిజం. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను 2022-23 విద్యాసంవత్సరం నుండే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు యూనివర్శిటీలలో క్లాస్‌ 12 మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చేవారు. ఇక నుండి కామన్‌ ఎంట్రన్స్‌ మార్కులను బట్టి ప్రవేశాలు ఉంటాయి.

హిందీ - హిందూత్వ

 రో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుంది. కర్త, కర్మ, క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్‌ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్‌ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారు. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదు.

వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన బలోపేతం : సీతారామ్‌ ఏచూరి

బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరు. సొంత బలాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యం. రాజకీయ, సామాజిక శక్తులను ఏకం చేసేందుకు కృషి - మీడియా గోష్టిలో సీతారామ్‌ ఏచూరి. కన్నూర్‌ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు తాము శక్తివంచనలేకుండా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. దీనికి ముందు పార్టీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం పట్ల నిబద్ధతను మహాసభ పునరుద్ఘాటించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామని, తద్వారా బిజెపి మతోన్మాద, కార్పొరేట్‌ కూటమి సవాల్‌ను తిప్పికొడతామన్నారు.

Pages

Subscribe to RSS - April