
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఏప్రిల్, 2024.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం
రాష్ట్రంలో పోటీచేసే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు మరియు సీట్లను ఖరారు చేసేందుకు సిపిఐ(యం) అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశం 2024 ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలో జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరవుతారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వివిధ పార్టీల వైఖరులు, ఇతర వామపక్ష లౌకిక, పార్టీలతో సిపిఐ(యం) ఎన్నికల సర్దుబాట్లపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి