April

బెదిరింపులు సహించ రాదు

ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ తటస్థ వైఖరి పాటించడం సరైంది కాదంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా బెదిరింపులకు దిగుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు విరుద్ధంగా భారత్‌ వ్యవహరిస్తే 'తీవ్ర పర్యవసానాలు' ఎదుర్కోవాల్సి వుంటుందంటూ అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల జాతీయ డిప్యూటీ సలహాదారు హుకుం జారీ చేయడం గర్హనీయం. భారత్‌లో పర్యటనకు వచ్చి ప్రభుత్వానికి ఈ విధంగా బెదిరించడం ఎంతమాత్రం అనుమతించరానిది. అదే సమయంలో భారత్‌ సందర్శనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌ ఏం కోరితే అది ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తాన్ని అందించారు.

కరెంట్‌ బాదుడు

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపింది. కరోనా విలయానికి జనం బతుకులు కకావికలమైన సమయాన ఇళ్లకు వాడే కరెంట్‌ బిల్లులు పెంచి షాక్‌ ఇవ్వడం సర్కారు కర్కశానికి తార్కాణం. ఇప్పటికే కేంద్రం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తుండగా దానికి విద్యుత్‌ ఛార్జీల భారం అదనం. గృహ వినియోగదారులపై పడే మొత్తం భారం రూ.4,300 కోట్లు. అందులో టారిఫ్‌ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్‌ వసూళ్లు రూ.2,900 కోట్లు.

Pages

Subscribe to RSS - April