
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 ఏప్రిల్, 2024.
వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారుల పింఛన్లు సచివాలయాల వద్ద కాకుండా మే 1న ఇంటి వద్దే పంపిణీ చేసేందికు ఏర్పాట్లు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
రోజురోజుకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వికలాంగులు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గత నెలలో రాష్ట్ర ఫ్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పింఛన్లు పంపిణీ సచివాలయాల వద్ద ఇవ్వడం వల్ల వృద్దులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాసినా, నగదు లేదని సమాధానం సిబ్బంది చెప్పడం, 1వ తేదీనే ఇవ్వవలసిన ఫించను సకాలంలో ఇవ్వకపోవడంతో పించనుదార్లు నానా అవస్థలు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసాలకు సచివాలయాలు దూరంగా ఉండడంతో, రవాణా సదుపాయాలు లేక, కొండలుదిగి రాలేక మరిన్ని ఇబ్బందులు పడ్డారు.
కావున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఫించన్లను సకాలంలో ఇంటి వద్దే పంపిణీ చేయాలి. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి ఇతర విధులు అప్పగించకుండా, సరిపడా నగదు ముందుగానే అందేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి