
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 ఏప్రిల్, 2024.
సామాజిక న్యాయం ‘‘ఇండియా బ్లాక్’’తోనే సాధ్యం
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలపై టిడిపి స్పందించాలి.
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ముస్లిం రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమని ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకసారి రిజర్వేషన్లు ఏ వర్గానికి ఎత్తేసినా ఆ తర్వాత వరుసలో దళిత, ఆదివాసీ, మహిళ, వికలాంగులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. దీనిపై ఎన్‌డియే భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు తమ వైఖరి ఏమిటో బహిరంగంగా ప్రకటించాలి. లేకుంటే వారు కూడా బిజెపి అభిప్రాయంతో ఉన్నట్లే భావించాలి. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్లు కాపాడుకోడానికి ఇండియా బ్లాకు పార్టీలను బలపరచాలని సామాజిక న్యాయం ఇండియాబ్లాక్ పార్టీలతోనే సాధ్యమని విజ్ఞప్తి చేస్తున్నాం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి