April

నల్లధనుల లిస్ట్ బయటపెట్టిన పనామా

పనామా పేపర్‌ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన నేతలు సెల్రబిటీల పేర్లు ఈ జాబితాలో ఉండటమే దీనికి కారణం. పన్ను ఎగవేతకు పాల్పడిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులు, బార్సిలోనా ఫార్వర్డ్‌ లియోనెల్‌ మెస్సీ, దాదాపు 1.15 కోట్ల రికార్డులున్న ఈ పత్రాలలో 2.14 లక్షల మంది విదేశృ ప్రముఖుల పేర్లున్నాయని ఐసిఐజె వివరించింది. ఈ పత్రాలు పనామాకు చెందిన న్యాయవ్యవహారాల సంస్థ మొస్సాక్‌ఫొనెస్కా నుండి లీకయినట్లు తెలుస్తోంది. 

పెట్రోల్‌పై రూ 2.19,డీజిల్‌పై 98 పైసలు..

సోమవారం రాత్రి పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు కేంద ప్రభుత్వం ప్రకటించింది. లీటర్‌ పెట్రో ల్‌పై రూ 2.19 పైసలు పెరగ్గా, లీటర్‌ డీజిల్‌ పై 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోలు ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

మార్క్సి‌స్టు‌ దృక్కోణం - కులం

దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపై హిందూత్వ శక్తుల దాడుల నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేధావుల్లో ఒక నూతన చర్చ మొదలైంది. కుల అణచివేత సమస్యను మార్క్సి స్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. నేడు జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాతిక ఎజెం డాలో భాగమైన విషయాన్ని కాదనలేము.

ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా కార్పోరేట‌ర్ల జీతాలు పెంచుకోవాల‌నుకోవ‌డం సిగ్గుచేటు. - సిపిఎం న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాథ్‌

ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా జీతాలు పెంచుకోవ‌డం సిగ్గుచేటు. 
    -  సిపిఎం న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాథ్‌ 

అర‌బిందో కార్మికుల పోరాటం విజ‌యం

శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం పైడిభీమ‌వ‌రం వ‌ద్ద గ‌ల  అర‌బిందో ఫార్మా ప‌రిశ్ర‌మలో ప‌నిచేస్తున్న వేలాది మంది  కార్మికులు సిఐటియు ఆద్వ‌ర్య‌ములో చేసిన   సాధించింది. నూత‌న వేత‌న ఒప్పందం జ‌రిగింది. అర‌బిందో కార్మికుల విజ‌యోత్స‌వ స‌భ‌లో  సిఐటియు రాష్ట్ర ఉసాధ్య‌క్షులు, అర‌బిందో ఫార్మా వ‌ర్కర్స్ యూనియ‌న్ గౌర‌వ అధ్య‌క్షులు సి.హెచ్.న‌ర్సింగ‌రావు మాట్లాడారు.ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ మ‌రింత ఐక్య‌త‌తో మందుకెళ్ళాల‌ని పిలుపునిచ్చారు.

కోల్‌కతా దుర్ఘటనతో మరింత ఇబ్బంది

కోల్‌కతాలో కుప్పకూలిన వివేకానంద పైవంతెనను నిర్మిస్తున్న ఐవీఆర్‌సీఎల్‌, కొంతకాలంగా అప్పుల భారంతో సతమతం అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.మౌలిక సదుపాయాల రంగంలోని ఇతర సంస్థల మాదిరిగానే ఐవీఆర్‌సీఎల్‌కు కూడా అప్పుల భారం అధికంగా ఉంది. అప్పులకు సంబంధించి వాయిదాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఎదురు కావడంతో, బ్యాంకులు కొంతకాలం క్రితం ఈ కంపెనీని స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టాయి. 

దళిత సంక్షేమంపై మోడీ మౌనమేల..?

దళితుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్‌ నేత పి.ఎల్‌.పునియా మోడీ సర్కార్‌ను విమర్శించారు. ప్రైవేట్‌ రంగంలో, న్యాయ వ్యవస్థలో కూడా కోటా వుండాలన్న డిమాండ్‌ చాలా పాతదని, కానీ దాని గురించే కేంద్రం ప్రస్తావించడం లేదన్నారు. యుపి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందన్నారు.

మైనార్టీ కమిషన్‌ కు CPMవిజ్ఞప్తి

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగ్గురు మైనార్టీ విద్యార్ధులపై కాషాయ గూండాలు దాడి జరపడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జాతీయ మైనార్టీ కమిషన్‌ అధ్యక్షులు నసీమ్‌ అహ్మదను సిపిఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం కలుసుకుని ఒక మెమోరాండం సమర్పించింది. 

ఎమ్మెల్యేల జీతాల పెంపుకు వ్యతిరేకం

'రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో రోడ్డు మీదకు నెట్టేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వానికి అండగా నిలవండి. జీత భత్యాలు అడగకండ'ి అంటూ హితబోధ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన జీతాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఒకసారి నిస్వార్థంగా మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగజేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన ఈ ప్రజా ప్రతినిధులు తీసుకునే డబ్బు ప్రజలదేనని గుర్తు చేశారు.

కాంగ్రెస్ వాళ్ళనైనా చేర్చుకుందాం:బాబు

సచివాలయంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో ఏ ముఖ్య నాయకుడు ఆసక్తి చూపి మన పార్టీలోకి వచ్చినా చేర్చుకుందాం. వైకాపా అనే కాదు కాంగ్రెస్‌లోనూ ముఖ్య నాయకులున్నారు. వారినీ చేర్చుకుందాం. శాసనసభ, మండలి స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోంది. అన్ని రకాల పదవులూ కలిపి రాష్ట్ర స్థాయిలో 400 నుంచి 500 ఉంటాయి. ఎంతమంది వచ్చినా ఎవరి అవకాశాలకీ గండిపడదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..

Pages

Subscribe to RSS - April