కరకట్ట ఇళ్ళ సమస్యపై తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలి - సిపిఎం పాదయాత్రలో సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌

ఒక పక్కన అధికారుల‌తో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాల‌ని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజల‌ను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్‌. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్‌ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు. ఇప్పటికైనా తొగుదేశం పార్టీ కరకట్ట ఇళ్లు తొగించానుకుంటున్నారా, ఇక్కడే ఉంచానుకుంటున్నారా స్పష్టం చేయాన్నారు. ఇదే కృష్ణా కరకట్టమీద కృష్ణంక నుండి రామలింగేశ్వరనగర్‌ వరకూ ఉన్న గృహాు ఒక్కటి కూడా తొగించం, ఎవరైనా వచ్చి ఇళ్లు తొగిస్తే మా ఇంట్లోకి వచ్చి ఉండండి అని అక్కడ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటిస్తుంటే, ఇక్కడ ప్రజాప్రతినిధు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో  చైనా, సింగపూర్‌ ప్రతినిధు అధికారుతో కలిసి పర్యటించారు. వారి వ్యాపారు కోసం, లాభా కోసం పేద వారి గుడిసొ క్చూటానికి పాకు సిద్ధమవుతున్నారన్నారు. ఈ పక్కనే వున్నటువంటి ఇళ్లు ఫ్లై ఓవర్‌ నిర్మాణం సందర్భంగా తొగించినప్పుడు పట్టాున్నవారికి గజానికి రూ. 53 వేలు నష్టపరిహారం, ఇళ్లు ఇచ్చారన్నారు. మరి ఆ రకంగానే ప్రభుత్వ పట్టాున్న కట్టమీద వారికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వరని అన్నారు. నాుగైదు పుష్కరా తరబడి ఉంటున్న వీరిని ఇక్కడి నుంచి తరిమి రోడ్డున పడేయాని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఇంటి యజమానుతో పాటు అద్దెదాయి కూడా చాలా కాంగా ఇక్కడే వుంటున్నారని, వారంతా ఇప్పుడు ఎక్కడ ఉండాని అన్నారు. పేదు కావటంతో వే రూపాయు అద్దొ చెల్లించి ఉండే పరిస్థితి కాదని తెలిపారు. ఒకపక్క రోజు రోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాతో ప్రజు అనేక ఇబ్బందు పడుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ధర నియంత్రణపై దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు.