
ఉన్నత చదువులు మరింత భారం కానున్నా యి. ఐఐటి, ఎన్ఐటిలతో పాటు జాతీయ విద్యా సంస్థల్లో ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ ( ఎమ్హెచ్ఆర్డీ ) నిర్ణయం తీసుకుంది. ఐఐటి బాంబే డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ఫీజుల విధానానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ. 90 వేలుగా ఉన్న ఐఐటి ఫీజు రూ.2 లక్షలుకు పెంచగా, రూ.70 వేలుగా ఎన్ఐటి ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. పెంచిన ఫీజులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఎమ్హెచ్ఆర్డీ తెలిపింది.