రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాల పై విచారణ జరపాలి.

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.
    ఈ సందర్భంగా గంగారావుగారు మాట్లాడుతూ రే లబ్ధిదారుకు నిర్మిస్తున్న ఇళ్ళు ప్రజలు నివసించడానికి ఏమాత్రం నివాస యోగ్యంగా లేవన్నారు. 10X12 అడుగుల స్థలంలో కేవలం 13 గజాల వైశల్యంలో ఇళ్ళు నిర్మించి కుటుంబాన్ని నివాసం ఉండమనడం దుర్మార్గమన్నారు. వీటి నిర్మాణం ఒక పెద్ద కుంభకోణం అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణాలు వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కొరకు మాత్రమే ఇవి చేపట్టారన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్క ఇంటికి 1,25,000/` రూపయిలు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లిస్తుందన్నారు. ఈ ఇళ్ళలో ఏ ఒక్క అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని నివాసం ఉండడానికి సిద్ధపడతారా? అని ప్రశ్నించారు. ఈ ఇళ్ళను, ‘‘రే’’ ఇళ్ళు పూర్తికాగానే తొగిస్తారు.కావున కాంట్రాక్టుకు డబ్బు చేల్లించే బదు   లబ్ధిదారుకు నేరుగా నెలకు 5000/` రూపయిలు చొప్పున ఇంటి అద్దె ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.
    ఈ గృహ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, ‘రే’ గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారు. ఎప్పటిలోగ లబ్ధిదారుకు అందజేస్తారో అనేది ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
    ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.శంకర్‌, బి. సూర్యమణి, ఎస్‌.రంగమ్మ, వి. నరేంద్రకుమార్‌, ఐ.సినాయుడు, ఎస్‌.కె నజీర్‌, జయలక్ష్మి,కె కుమారి, గణపతి తదితరు పాల్గొన్నారు.