April

దళిత సంక్షేమంపై మోడీ మౌనమేల..?

దళితుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్‌ నేత పి.ఎల్‌.పునియా మోడీ సర్కార్‌ను విమర్శించారు. ప్రైవేట్‌ రంగంలో, న్యాయ వ్యవస్థలో కూడా కోటా వుండాలన్న డిమాండ్‌ చాలా పాతదని, కానీ దాని గురించే కేంద్రం ప్రస్తావించడం లేదన్నారు. యుపి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందన్నారు.

మైనార్టీ కమిషన్‌ కు CPMవిజ్ఞప్తి

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగ్గురు మైనార్టీ విద్యార్ధులపై కాషాయ గూండాలు దాడి జరపడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జాతీయ మైనార్టీ కమిషన్‌ అధ్యక్షులు నసీమ్‌ అహ్మదను సిపిఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం కలుసుకుని ఒక మెమోరాండం సమర్పించింది. 

ఎమ్మెల్యేల జీతాల పెంపుకు వ్యతిరేకం

'రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో రోడ్డు మీదకు నెట్టేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వానికి అండగా నిలవండి. జీత భత్యాలు అడగకండ'ి అంటూ హితబోధ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన జీతాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఒకసారి నిస్వార్థంగా మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగజేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన ఈ ప్రజా ప్రతినిధులు తీసుకునే డబ్బు ప్రజలదేనని గుర్తు చేశారు.

కాంగ్రెస్ వాళ్ళనైనా చేర్చుకుందాం:బాబు

సచివాలయంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో ఏ ముఖ్య నాయకుడు ఆసక్తి చూపి మన పార్టీలోకి వచ్చినా చేర్చుకుందాం. వైకాపా అనే కాదు కాంగ్రెస్‌లోనూ ముఖ్య నాయకులున్నారు. వారినీ చేర్చుకుందాం. శాసనసభ, మండలి స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోంది. అన్ని రకాల పదవులూ కలిపి రాష్ట్ర స్థాయిలో 400 నుంచి 500 ఉంటాయి. ఎంతమంది వచ్చినా ఎవరి అవకాశాలకీ గండిపడదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..

నవ్యాంధ్రలో 50 నియోజకవర్గాల పెంపు..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న వార్త రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రలో కొత్తగా 50 నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చే అవకాశముంది. 

లోక్‌పాల్‌ నిబంధనలు పాటించాల్సిందే..

లోక్‌పాల్‌ చట్టంలోని నూతన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విదేశీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముల వివరాలను వెల్లడించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులంతా తమ జీవిత భాగస్వామి, పిల్లల విదేశీ ఖాతాల వివరాలనూ ప్రకటించాల్సిందేనని సూచించింది. 

కరవుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

కరవుకు సంబంధించి చేపట్టిన చర్యలపై సుప్రీం కోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని రాష్ట్రాల్లో కరవు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేశారని అడిగింది. జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ఈ వివరాలను తనకు తెలియజేయాలని జస్టిస్‌ ఎం.బి.లోకుర్‌, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కరవు మాన్యువల్‌, కరవు నిర్వహణ మార్గదర్శకాలపై పూర్తి వివరాలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

Pages

Subscribe to RSS - April