
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూసిందని తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారంలో ఉండగా సచార్ కమిటీ సిఫార్సులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు