భారత ప్రధాని పాక్ కు లొంగిపోయారు

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని పరిశోధించడానికి పాకిస్థాన్‌ బృందాన్ని ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోడీ భారత్‌మాతాకు వెన్ను పోటు పొడిచారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.  దేశ సమగ్రతను అవమాన పర్చిన మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రధాని పాకిస్థాన్‌కు లొంగిపోయారని విమర్శించారు. గత 65 సంవత్సరాల కాలంలో ఏ ప్రధాని కూడా ఇలాంటి ఘోర తప్పిదానికి పాల్పడలేదని అన్నారు. పాకిస్థాన్‌ అధికారులు బృందం పరిశీలించి వెళ్లిన తరువాత, ఆ దేశ మీడియా ఈ దాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఏమి లేదని, ఇండియానే దాడికి పాల్పడి పాకిస్థాన్‌ను అప్రతిష్టపాల్జేసిందనే వార్తలు రాయడాన్ని కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు.