ఏపి ప్రత్యేక హోదా సాధనకై పాదయాత్ర

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఎం,సిపిఐ,జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు . వైసిపి, టిడిపి చేసే పోరాటాల్లో చిత్తశుద్ధి లేదని చెప్పారు. మేం నిజాయితీగా పోరాటం చేస్తున్నామని, కార్యకర్తలతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మ‌ధు, రామ‌కృష్ణ‌ మాట్లాడుతూ  21 రోజులుగా పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసానికి ప్రయత్నిస్తుంటే బిజేపి అడ్డుకుంటు వస్తోందన్నారు. ప్రజా క్షేత్రంలో అవిశ్వాసం పెట్టె హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు బిజెపిపై విశ్వాసం లేదన్నారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్ఘాటించారు. బంద్‌, హర్తాళ్లతో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. మూడేళ్ళుగా ప్రత్యేక హోదా కోసం మేము పోరాడుతుంటే మా పై కేసులు పెట్టారని పేర్కొన్నారు..