పార్టీ కార్యక్రమాలు

Wed, 2015-12-16 16:22

గత 45రోజులుగా రిలే నిరహారదీక్షలు చేస్తున్న విఆర్ఎలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. 45రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వాళ్లనందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తాను అధికారంలోనికి వస్తే అందరిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని కాని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వి ఆర్ ఎ లు చేసే న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని మధు తెలిపారు.. 

Tue, 2015-12-15 17:06

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం...

Mon, 2015-12-14 17:20

రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధి సమితి అధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు..అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

Sat, 2015-12-12 17:21

రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 

Fri, 2015-12-11 15:47

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారని రైతులు అడ్డుపడటంతో...

Thu, 2015-12-10 17:44

విజయవాడలో కల్తీ మద్యం మరణాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కమిషన్‌ నియమించాలని సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర కార్యదర్శి డి.కాశీనాథ్‌తో కలిసి మధు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించటం శోచనీయమన్నారు. గతేడాది రూ.11 వేల కోట్ల రాగా, ఈ ఏడాది రూ.15 వేల కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్‌ ఇచ్చిందని...

Wed, 2015-12-09 13:35

విజయవాడ కల్తీ మద్యం ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడిషియల్‌ విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యత వహించి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. కల్తీ మద్యం ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బందర్‌ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా చేయాలని, ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని, స్వర్ణా బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలు ముఖానికి నల్లగుడ్డలు కట్టుకుని ప్రభుత్వ మద్యం పాలసీపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ కల్తీ మద్యం కారణంగా...

Tue, 2015-12-08 12:11

 విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు..కల్తీ మద్యం మృతులు, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 40 మంది సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు సిఎం చంద్రబాబు వెళ్లినపుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కల్తీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర పదవికి రాజీనామా చేయాలని బాబురావు డిమాండ్‌ చేశారు. బార్‌ యజమానులును అరెస్టు చేయడంతో...

Mon, 2015-12-07 20:03

రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్‌ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామి అన్నారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్‌ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్‌ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు. గతంలో టెర్రిస్టులు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు...

Mon, 2015-12-07 16:27

 బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్‌ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు.  బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌స్‌ అధికారం కోసమే తాపత్రయం...

Sat, 2015-12-05 17:35

చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

Fri, 2015-12-04 17:07

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వామపక్షాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Pages