పార్టీ కార్యక్రమాలు

Tue, 2015-11-24 11:40

సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, నిర్వాసిత రైతులను ప్రభుత్వం నిర్బంధించింది. అరెస్టు చేసి 22 మందిని జైలుకు పంపింది. అనంతపురం జిల్లా ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించ కుండానే భూములను కంపెనీకి కట్టబెట్టింది. నిర్వాసిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సిపిఎం మద్దతిచ్చింది. సోలార్‌ భూముల్లోకి చొచ్చుకెళ్లి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎర్రజెండాలను పాతారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పనులు సాగనీయబోమని హెచ్చరించారు.

Sat, 2015-11-21 10:56

వరద బాధితులకు సిపిఎం అపన్నహస్తం అందించింది. నెల్లూరు నగరంలో బాధితులకు స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతృత్వంలో సాయం అందజేశారు. నాయకులు నడుముల్లోతు నీళ్లలోనే వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆహారపొట్లాలు, మంచీనీటి ప్యాకెట్లు, కొవ్వొత్తులు అందించారు.ఐదురోజులుగా నగరంలోని సుమారు 30 వేల ఇళ్లు నీటిలోనే ఉండడం పట్ల మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు సిపిఎం ముందుంటుందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే వరద సంభవించిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నెల్లూరు చెరువు గేటు ఎత్తేశారని అన్నారు. కాలువలు ఆక్రమణకు గురికావడం వల్లనే నీరు తియ్యలేదన్నారు....

Fri, 2015-11-20 11:01

ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్‌ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 30తో గడువు ముగిసినా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 41 శాతం మేర విద్యుత్‌ ఆదా చేసేందుకు 2014 ఆగస్టు 14వ తేదీ వరకూ వీధిలైట్ల నిర్వహణ రియల్‌ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుందని, కానీ ఆ రీతిలో విద్యుత్‌ ఆదా చేయలేదని తెలిపారు. అయినా 2007 నుండి...

Thu, 2015-11-19 15:42

బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్‌ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్‌ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్‌ లభించింది.

Thu, 2015-11-19 13:19

నెల్లూరులో వరద గ్రామాలలో సిపిఎం సహాయకచర్యలు చేపట్టింది. గ్రామా గ్రామాన వరదల్లో చిక్కుకున్న వారికి సహాకారం అందించడంతో పాటు ఆహారపొట్లాలను అక్కడి సిపిఎం కార్యకర్తలు పంపిణి చేస్తున్నారు ..వరదలవలన నష్టపోయినవారిని ఆదుకోవడం కోసం చేయి చేయి కలపాలని కోరుతున్నారు.

Wed, 2015-11-18 11:51

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రైతు వ్యతిరేక భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు హెచ్చరించారు. భూ బ్యాంకు విధానానికి నిరసనగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో చేపట్టిన దీక్షలను పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, బాబురావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంలో భూము లిచ్చిన రైతులకు ప్లాట్లు ఎక్కడిస్తారో ఇప్పటికీ స్పష్టం చేయ లేదని, అభివృద్ధిని కేంద్రీకరిస్తే అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Mon, 2015-11-16 10:49

బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్‌ నుండి నవకళ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన...

Sat, 2015-11-14 12:28

భూములు, వృత్తుల పరిరక్షణ కోసం రైతులు, పేదలు, చేతివృత్తిదారులు ఏకోన్ముఖంగా కదలాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. భూముల పరిరక్షణకు ఒకవైపు ప్రజాపోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం దళారీపాత్ర పోషిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత రైతుల భూముల రిజస్ట్రేషన్లు జరిగేలా, భూముల మార్కెట్‌ విలువ పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

Thu, 2015-11-12 17:18

దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

Mon, 2015-11-09 15:13

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Sat, 2015-11-07 12:44

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్వంలో నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దోమల నుంచి రక్షించండి, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ, విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు కబోది పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడంలేదన్నారు.

Fri, 2015-11-06 12:53

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు సర్వ హక్కులూ ఇస్తున్నాయని, బాక్సైట్‌ వల్ల ప్రభుత్వానికి...

Pages