పార్టీ కార్యక్రమాలు

Tue, 2016-01-05 14:54

కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి. రైతులు తిరుగు బాటు చేస్తేనే ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు అడ్డుకట్ట పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపు నిచ్చారు.

Sat, 2015-12-26 10:47

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేయాలని, హుదూద్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు, గిరిజనులకు, కూలీలకు పరిహారం చెల్లించాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మ్యూజియం వద్ద నిరసన తెలుపుతుండగా తొమ్మిది మంది సిపిఎం, గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించిన...

Thu, 2015-12-24 17:52

ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థాగత రుణాలను రైతులను ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

Tue, 2015-12-22 11:30

 కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్‌ సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్‌ తీరును నిరసిస్తూ వాహనాన్ని కదలకుండా సిపిఎం శ్రేణులు భైఠాయిం చాయి. ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించారు. ఈ బృం దాలు కలెక్టరేట్‌లోకి చేరుకున్న వెంటనే ఉద్యమకా రులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.కలెక్టర్‌ సభాభవన్‌లోని గ్రీవెన ్‌సెల్‌ కార్యక్రమంలో ఉన్నప్పటికీ స్పందించక పోవడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా భవనం వద్దకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు...

Fri, 2015-12-18 18:38

పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు. ఏసీ గదుల్లో ఉండడం కాదు..వారి కోపాన్ని తట్టుకొనే శక్తి ఉందా అని బాబును ఉద్ధేశించి...

Thu, 2015-12-17 16:09

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి కాల్‌ మనీ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, లిబ రేషన్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బహు జన సమాజ్‌ పార్టీల ఆధ్వర్యంలో బుధ వారం వంద లాది మంది భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సిపి గౌతమ్‌ సవాంగ్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు మాట్లా డుతూ, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ ఘటనపై ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా స్పందించా లన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ పార్టీకి చెందిన నేతలు ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంద న్నారు.

Wed, 2015-12-16 16:22

గత 45రోజులుగా రిలే నిరహారదీక్షలు చేస్తున్న విఆర్ఎలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. 45రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వాళ్లనందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తాను అధికారంలోనికి వస్తే అందరిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని కాని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వి ఆర్ ఎ లు చేసే న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని మధు తెలిపారు.. 

Tue, 2015-12-15 17:06

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో 40 వేల మంది వ్యవసాయ కార్మికులుంటే కేవలం...

Mon, 2015-12-14 17:20

రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధి సమితి అధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు..అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

Sat, 2015-12-12 17:21

రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 

Fri, 2015-12-11 15:47

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారని రైతులు అడ్డుపడటంతో...

Thu, 2015-12-10 17:44

విజయవాడలో కల్తీ మద్యం మరణాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కమిషన్‌ నియమించాలని సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర కార్యదర్శి డి.కాశీనాథ్‌తో కలిసి మధు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించటం శోచనీయమన్నారు. గతేడాది రూ.11 వేల కోట్ల రాగా, ఈ ఏడాది రూ.15 వేల కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్‌ ఇచ్చిందని...

Pages