పార్టీ కార్యక్రమాలు

Thu, 2015-11-05 12:47

బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్‌ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటర్లకు చౌకగా కట్టబెట్టేందుకే జిల్లాలో 33 మండలాల్లో పేదలు, రైతులకు చెందిన భూముల్ని సేకరిస్తోందని విమర్శించారు.

Wed, 2015-11-04 15:55

చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖ జిల్లా  సీపీఎం కార్యదర్శి లోకనాధం ఆగ్రహం వ్యక్తం చేసారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్‌ బెస్‌ స్పెషల్‌ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్‌ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 

Tue, 2015-11-03 10:41

నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్‌, ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మాత్రమే...

Mon, 2015-11-02 17:07

గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Sat, 2015-10-31 16:53

రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర  ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్‌ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్‌ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు. అవసరానికి మించిన భూములను జోలికెళ్లొద్దని, పారిశ్రామిక అభివృద్ధికి ఎంత భూమి కావాలో అంతా తీసుకోవాలని సూచించారు. 

Thu, 2015-10-29 18:15

రాజధాని ప్రాంతానికి భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఏపి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కృష్ణానది ఒడ్డున నివసించే పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నించినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అసైన్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్‌ చేశారు.

Wed, 2015-10-28 10:57

 ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు .  చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

Tue, 2015-10-27 12:21

 పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కు ంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సర్వే చేసిన గ్రామాల్లో సోమవారం సిపిఎం బృందం పర్యటించింది. అధైర్య పడవలసిన అవసరంలేదని, రైతులకు సిపిఎం అండగా నిలుస్తు ందని భరోసా ఇచ్చారు. అనంతరం వైవి మాట్లాడు తూ, రాష్ట్రంలో జిల్లాకు లక్ష చొప్పున 13 లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకు పేరుతో ప్రభు త్వం లాక్కుంటోంద న్నారు. దొనకొండలో అధికా రులు చేసిన సర్వేపై సరైన పరిశీలన లేకుండానే 25 వేల ఎకరాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేయ డం సరికాదన్నారు. గత ప్రభుత్వం భూ పంపిణీలో ఇచ్చిన వాటిని...

Fri, 2015-10-23 18:56

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడూతూ ప్రధాని మోడి రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్థాడని ప్రజలు ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకహోదా పైనా, ఆర్ధికంగా,...

Wed, 2015-10-21 16:39

మ‌న్యంలో మ‌లేరియా, ఇత‌ర విషజ్వ‌రాల‌ బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో  సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాలు తీర్చి, ప్రాణాలు నిల‌బ‌ట్టే వైద్య‌శాల‌గా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్  మిడియం బాబూరావు సార‌ధ్యంలో జేవీవీ, ఇత‌ర ప్ర‌జా రంగాల వైద్యులు, నెల్లూరు ప్ర‌జావైద్య‌శాల‌కు చెందిన వైద్యులు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి సేవ‌లు అందించారు. సెరిబ్ర‌ల్ మ‌లేరియాతో వ‌ణుకుతున్న గిరిజ‌నుల‌ను ఆదుకుని వారి ప్రాణాలు నిల‌బెట్టిన ఈ శిబిరానికి ప‌లువురు స‌హాయం అందించారు.

Tue, 2015-10-20 12:25

 పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్‌ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్‌ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ఏరియాలో భూ బ్యాంక్‌ ద్వారా గిరిజన...

Mon, 2015-10-19 14:16

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక...

Pages