పార్టీ కార్యక్రమాలు

Tue, 2015-08-18 14:30

 విశాఖలో బాక్సైట్‌ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్‌ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్‌ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ ఖనిజం మొత్తం 550 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దీనికి రూ.11,400కోట్లుగా లెక్కకట్టి, తర్వాత ఒప్పందంలో రూ.2800 కోట్లకు...

Sat, 2015-08-15 11:01

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు. బడ్జెట్‌ సమావేశాలలోపు ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒక...

Fri, 2015-08-14 12:05

శ్రీకాకుళం జిల్లా పోలాకి ధర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజా ఉద్యమాలపై నిర్భంధాన్ని ఖండించాలని శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మల్ ప్లాంట్ల ఏర్పాటుతో ఉపాధి కలగకపోగా రైతులకు , వ్యవసాయ కూలీలకు వున్నా ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేసారు .. అభివృద్ధి పేరుతొ రైతుఅల్ నోట్లో మట్టి కొట్టాలని చుస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ,త్వరలో పోలకిలో పర్యటిస్తామని అన్నారు. 

Thu, 2015-08-13 13:02

ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముంపు మండలాల్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ముంపునకు గురవుతున్న ఆరు మండలాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌...

Wed, 2015-08-12 12:04

శ్రీకాకుళం జిల్లాలో పోలాకి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వెళ్లిన సిపిఎం  నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్ర‌యోగించింది. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి మ‌ధుని దౌర్జన్యంగా  అరెస్ట్ చేసారు. ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్ప‌టికే స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప‌లు ఉద్య‌మాలు సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు విన‌డానికి వెళ్లాల‌నుకున్ననాయకుల సమాచారం ముందుగానే  తెలుసుకుని రైల్వే స్టేష‌న్ లో దిగ‌గానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

Tue, 2015-08-11 11:20

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు. కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో...

Mon, 2015-08-10 13:23

నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున మైనార్టీల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. 

Sat, 2015-08-08 14:36

సిపిఎం ఆధ్వర్యాన రాజమండ్రిలో "ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు" అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధ్యసాధ్యాల పై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కై సిపిఎం కృషి చేస్తోందన్నారు. 

Fri, 2015-08-07 10:27

కుప్పంలో ఏకపక్షంగా జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న కుప్పం నియోజక వర్గంలోని కడపల్లి, పాడుచేన్లు, తిమ్మరాజుపల్లి, కనుమలదొడ్డి, బీర్నకుప్పం గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను ఆయన సందర్శించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కడపల్లిలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంకు పేరిట పది లక్షల ఎకరాలను ఏకపక్షంగా...

Thu, 2015-08-06 12:55

ప్రజా సమస్యలపై సిపిఎం చేపట్టిన ప్రచారాందోళనల్లో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం బాధ్యత తీసుకుని రాజధాని వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ ఈశ్వర ప్రసాద్‌తోనూ, రోగులతోనూ మాట్లాడి వైద్యసేవలపై వివరాలు సేకరించారు. 10 లక్షల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడ్డా అందుకనుగుణంగా సదుపాయాల్లేవన్నారు. డాక్టర్ల కొరతతోపాటు దోభీ, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రికి ఆర్‌టిసి లోకల్‌ సర్వీసులు తిప్పాలని,కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలనూ పెంచాలని డిమాండ్‌ చేశారు. 

Wed, 2015-08-05 12:26

గుంటూరులో బజరంగ్ జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళనకు సిపిఎం అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిగణలోనికి తీసుకోని వారి జీవనోపాధికి సంబందించిన జ్యూట్ మిల్లును వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. 

Tue, 2015-08-04 13:09

రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య, రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు తక్షణమే పింఛను...

Pages