గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు సిపిఎం సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు
ఎ.పి కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని గడియార స్ధంబం సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .
జిల్లాలో సోలార్‌ప్లాంట్ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు.
కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు.రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు. లేపాక్షి, వాన్ పిక్, తుండూరు ఆక్వా ఫుర్ పార్కుల నిర్మాణం చేయాలనే...
ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తరువాత దృష్టి సారిస్తే రైల్వే జోన్ ప్రకటించాలి..ఉక్కు పరిశ్రమ ప్రకటించాలి కదా అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ..గిరిజన యూనివర్సిటీ పెద్ద వాటిని పక్కన పెట్టి చిన్న చిన్న వాటివి కల్పిస్తారా ? అని నిలదీశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజీపేటలో దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అనేకేళ్లుగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటే ప్రభుత్వ వాటికి హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు....
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...
కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు. పుష్కరాల హడావుడితో ట్రాఫిక్ ఆంక్షలను అంచనాలను మించి...
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం శ్రేణులు ఆందోళన చేశారు.. టిడిపి పార్టీది అవకాశవాద రాజకీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు..కేంద్రం ప్రకటించిన ఎటువంటి హామీలు అమలు కాలేదని, ప్రతిపక్షాలు నిరసనలు..బంద్ లు చేపట్టవద్దని, జపాన్ తరహాలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతోందని విమర్శించారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రదర్శనలు చేయవచ్చు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు నిరసనలు..ఆందోళనలు చేయవద్దా అని ప్రశ్నించారు. అవకాశ వాద రాజకీయాల మీద బతుకుతోందని తెలిపారు.
ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు అతితక్కువగా కేటాయించి ఈ పార్లమెంట్ సమావేశంలో నాబార్డు ద్వారా నిధులు ఇస్తామని చెబుతున్నారు. ద్రవ్యలోటు...
రాష్ట్రంలో తక్షణమే కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. పదేళ్లుగా కనీస వేతనాల చట్టాన్ని సవరించలేదన్నారు. దీంతో ప్రతి నెలా కార్మికులు రూ.500 కోట్లు నష్ట పోతున్నట్లు తెలిపారు. 65 షెడ్యూల్స్‌లోని కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, విఆర్‌ఎ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.