పార్టీ కార్యక్రమాలు

Thu, 2016-12-08 16:26

కొల్లేరు కాలుష్యానికి కారణం పరిశ్రమలే కారణం.ముంపుకి కారణం సరైన ఛానలైజేషన్ లేదు.జబ్బు ఒకటైతే ప్రభుత్వం వేరే మందు వేసింది. ప్రజల జీవితాలను నాశనం చేసింది.కొల్లేరు కాంటూరు 5 నుండి 3 కి కుదించి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాల్సిందే..ప్రజాభేరి పాదయాత్ర లో భాదితులనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి..

Tue, 2016-11-29 10:30

పెద్ద నోట్ల రద్దు చేసి ప్రజలను ఎనలేని ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రధాని మోడీ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ చేపట్టిన హర్తాళ్‌ రాష్ట్రంలో విజయవంతమైంది..హర్తాళ్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పటికీ విద్యా, వ్యాపార సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా సహకరించారు. పోలీసులు నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను మూసివేశారు. వాణిజ్య, విద్యాసంస్థలూ మూతపడ్డాయి. 

Tue, 2016-11-22 14:40

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు 

Mon, 2016-11-14 11:12

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ...

Fri, 2016-11-04 16:06

ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంపై సమావేశాలు ఏర్పాటు చేస్తారేగానీ ముంపు మండలాల గిరిజనుల ఘోష మాత్రం పట్టించుకోవడం లేదు. 2018 లోగ పోలవరం పూర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం ఏడుమండలాల ప్రజలకు ప్యాకేజి,పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేయాలని చూస్తోందని విలీన మండలాల సమగ్రాభివృద్ధి కొరకు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర సర్కార్ పై మండిపడిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు తదితరులు..

Fri, 2016-11-04 15:19

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Wed, 2016-11-02 11:29

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాద‌యాత్ర న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌లోనూ సాగుతుంద‌న్నారు. 

Wed, 2016-10-26 13:04

విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్‌ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దోమల బెడదతో అల్లాడి పోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, డ్వాక్రా రుణ మాఫీ సక్రమంగా జరగలేదని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారనీ, కానీ ఎవరికీ జాబు రాలేదని వివరించారు.

Sat, 2016-10-22 10:25

ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని చెప్పారు.

Mon, 2016-10-10 14:47

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు..పదవిలోనికి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన ఇప్పటివరకు ఎటువంటి ప్రయెాజనం జరగలేదు..పైగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టులు చేయడం దారుణం..ఈ అరెస్టులను సిపిఎం ఖండిస్తుంది.....

Sat, 2016-10-01 16:54

తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Sat, 2016-09-24 16:50

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

Pages