శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ అరెస్టులతో పోలీసులు అణు వ్యతిరేక పోరాటాన్ని అడ్డుకోలేరని ఆయన హెచ్చరించారు.