గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..
పార్టీ కార్యక్రమాలు
25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించటంతోపాటు ప్రత్యామ్నాయాన్ని...
నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం . విజయవాడలో సీపీఎం నిరశన .
దళితుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు రావడంతోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌గా నియమించారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించినపుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లని అన్నారు.
ఒక పక్కన అధికారులతో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజలను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు. ఇప్పటికైనా తొగుదేశం పార్టీ కరకట్ట ఇళ్లు తొగించానుకుంటున్నారా, ఇక్కడే...
రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు చైర్మన్, కమిటీ సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. దళితులపై...
రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో విజయవాడలో జరి గిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి పి. మధు మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. నిజాలను కప్పిపుచ్చి సమస్యలను పక్కదారిపట్టించేలా బూటకపు ప్రచా రాలకు దిగుతున్న ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా తగిన సహాయ చర్యలు చేపట్టలేదని ఆ పార్టీ పే ర్కొంది. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల పరి ష్కారానికి ఉద్యమబాట పట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.30 వేల...
ప్రజాసమస్యలు పరిష్కరించకుండా జీతాలు పెంచుకోవడం సిగ్గుచేటు.
- సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్
ప్రజా సమస్యలు పక్కన పెట్టి కార్పొరేటర్ల జీతాలు, అలవెన్సులు పెంచుకునే పనిలో అదికాపక్షం వుందని, మరో ప్రక్క జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదని ఇది సిగ్గుపడాల్సిన విషయం అని కాశీనాథ్ అన్నారు. సోమవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం సిపిఎం కార్పొరేటర్ నిలదీయనున్నారని తెలిపారు. దీనితో పాటు పలు అంశాలపై కౌన్సిల్ చర్చించాలని ఆయన కోరారు. మేయర్ ఏకపక్షంగా కౌన్సిల్ నిర్వహించినట్లయితే కౌన్సిల్ లోప, బయట ఆందోళన చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ...
'రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో రోడ్డు మీదకు నెట్టేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వానికి అండగా నిలవండి. జీత భత్యాలు అడగకండ'ి అంటూ హితబోధ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన జీతాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఒకసారి నిస్వార్థంగా మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగజేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన ఈ ప్రజా ప్రతినిధులు తీసుకునే డబ్బు ప్రజలదేనని గుర్తు చేశారు. ప్రజలు కట్టే పన్నులు, అదీ పేదల రక్తం పిండి, జనంతో మందు తాగించి, పెట్రోల్, డీజిల్‌ల్లో కొట్టేసిన డబ్బేనని తీవ్రంగా విమర్శించారు. తమ తాత ముత్తాతలు సంపాదించిన...
'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. రైతులకు నష్టం కలిగించే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లోకి రావాలన్నారు. గన్నవరం ఎంఎల్‌ఎ రామవరప్పాడులో...
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాబోయే ఏడాది కాలంలో విద్యా, ఉపాధి, సామాజిక అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని...
విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్ నుంచి టవర్‌క్లాక్ సర్కిల్ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు. కంపెనీలు ఎకరా మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. రూ.3 కోట్ల విలువజేసే...