దళితుల సమస్యల పరిష్కారం కోసం..

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు చైర్మన్‌, కమిటీ సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై యూనివర్శిటీలు, కాలేజీలలోనూ వివక్షత కొనసాగుతోందని పేర్కొన్నారు. అందుకే రోహిత్‌ పేరుతో చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కెవిపిఎస్‌ ఆధర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య యాత్రల్లో భాగంగా  ఆ సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య సైకిల్‌యాత్ర లో పాల్గొన్నారు..