పార్టీ కార్యక్రమాలు

Thu, 2018-07-12 12:27

గుంటూరులో అక్ర‌మంగా అరెస్టు చేసిన ముస్లిం యువ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, వారిపై పెట్టిన అక్ర‌మ‌కేసుల‌ను ఎత్తివేయాల‌ని కోరుతూ సిపిఎం,సిపిఐల ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు.అక్ర‌మంగా అరెస్టు అయిన బాధితుల కుటుంబాల‌ను పరామర్శించడానికి  బ‌య‌లుదేరిన సిపిఎం కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు.సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు, రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు వి.కృష్ణ‌య్య‌, సిపిఐ నాయ‌కులు ఓబులేసు, మాజీ ఎమ్మేల్సీ కె.ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుల‌ను అరెస్టు చేసి న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు 

Wed, 2018-07-04 15:15

విజయనగరం జిల్లా సాలూరు లోని గిరిజన ప్రాంతాలలో శిఖపరువు,తామరకొండ, పోలిమెట్ట,దుక్కడమెట్టల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తామరకోండ,పోలిమెట్ట,దుక్కడమెట్ట శిఖపరువు కొండలను త్రవ్వకాలు చేయవదంటూ సిపిఎం నాయకత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలోని  పనులు అడ్డుకోవడం కోసం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ కృష్ణమూర్తి ప్రజలతో  కలిసి ర్యాలీగా బయలుదేరారు.. 

Fri, 2018-06-29 12:08

ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతోనే జిల్లా బతుకు ఆధార పడి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర విభజనానంతరం కనీసం ఆరు నెలల్లోపు కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా దాని వూసే లేదని పేర్కొ న్నారు. జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉందన్నారు. అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు లక్ష మందికిపరోక్షంగా ఉపాధి అవకాశం...

Wed, 2018-06-27 16:19

దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్‌, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు. దళితులు, కార్మికులు, గిరిజనులు ఉన్న హక్కులు కోల్పోతున్నారన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన్‌...

Wed, 2018-06-20 14:10

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. కేంద్రం పెట్రోలు, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడంతో రైతులపై వందల కోట్ల రూపాయల భారాలు పడ్డాయని, ఇదే సమయంలో రైతులకు గిట్టుబాటు...

Fri, 2018-06-15 11:08

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కబేళా, సింగ్‌నగర్‌లో, జక్కంపూడి వైఎస్‌ఆర్‌కాలనీలో మధ్యలో...

Wed, 2018-06-13 11:32

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.పెద్దిరెడ్డి, ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తదితరులను పోలీసులు...

Mon, 2018-05-28 11:11

ఏ.కొండూరు కిడ్నీ బాధితులందరికి ఆర్థికసహయం, ఆయా కార్పొరేషన్ల నుండి ఋణాలు, తిరువూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, అన్ని గ్రామాలకు పైపులైన్ ద్వారా కృష్ణ జలాల సరఫరా, పెన్షన్లు, డయాలసిస్ చేయించుకునే వారికి అంబులెన్స్, ఉచితంగా మందుల సరఫరా, చనిపోయిన కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రెసియా వెంటనే ఇవ్వాలి.భావితరాలకు కిడ్నీ సమస్య రాకుండా చౌక డిపోల ద్వారా పౌష్టికాహారం అందించాలి వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ch. బాబురావు గారు,సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి d.v కృష్ణ గారు,జిల్లా కమిటీ సభ్యులు g. విజయప్రకాశ్ గారు అధికారులకు వినతిపత్రం అందించారు.

Tue, 2018-05-22 15:56

రాష్ట్ర సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు,సాయుధ తెలంగాణ పోరాటాయోధుడు,కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్మిక నేతగా,శాసన సభ్యుడు గా ఎదిగి స్వంత ఆస్తి లేకుండానే మరణించిన ఆదర్శనేత కామ్రేడ్ పర్స సత్యన్నారాయణ గారి మూడవ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్న సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నర్శింగరావు ఎంఏ గఫూర్ లు...

Mon, 2018-04-16 12:27

రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

Fri, 2018-04-06 15:30

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఎం,సిపిఐ,జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు . వైసిపి, టిడిపి చేసే పోరాటాల్లో చిత్తశుద్ధి లేదని చెప్పారు. మేం నిజాయితీగా పోరాటం చేస్తున్నామని, కార్యకర్తలతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మ‌ధు, రామ‌కృష్ణ‌ మాట్లాడుతూ  21 రోజులుగా పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసానికి ప్రయత్నిస్తుంటే బిజేపి అడ్డుకుంటు వస్తోందన్నారు. ప్రజా క్షేత్రంలో అవిశ్వాసం పెట్టె హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు బిజెపిపై విశ్వాసం లేదన్నారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్ఘాటించారు. బంద్‌, హర్తాళ్లతో ఆందోళనకు...

Wed, 2018-03-07 16:46

ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

Pages