ఎన్టీపీసీ సోలార్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని చెప్పారు.