అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు..పదవిలోనికి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన ఇప్పటివరకు ఎటువంటి ప్రయెాజనం జరగలేదు..పైగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టులు చేయడం దారుణం..ఈ అరెస్టులను సిపిఎం ఖండిస్తుంది..అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే పోరాటానికి సిపిఎం మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు .