July

విధ్వంసకర అభివృద్ధి

 విధ్వంసకర అభివృద్ధికి తాము వ్యతిరేకమని మానవ హక్కుల వేదిక 5వ జిల్లా మహా సభలో వక్తలు స్పష్టంచేశారు. నగరంలోని సిరిపురం కూడలిలోని బిల్డర్సు అసోసియేషన్‌ సభా వేదికలో ఆదివారం జిల్లా అధ్యక్షులు ఎం.శరత్‌ అధ్య్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ పదేళ్లుగా తమ సంఘం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టులను, పరిశ్రమలను వ్యతిరేకిస్తామని తమ మీద నింద ఉందని, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, విధ్వంసకర అభివృద్ధిని మాత్రమే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మావోయిస్టుల అల్టిమేటం

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ డ్రామాలు మొదలు..

 వచ్చే వారం మొదలు కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లు ఆమోదం పొందడానికి వీలుగా, జులై 15న ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. నీతి ఆయోగ్‌ ఏర్పడిన తరువాత ఇలా సమావేశం కావడం ఇది రెండవసారి. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమే లేదు. భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేకం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష కాంగెస్‌ తన పార్టీ వారికి ఆ విధంగా సూచనలు ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పాగా

 ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తమ పార్టీ శాఖల పని తీరుపట్ల పూర్తి అసంతృప్తితో ఉన్న బిజెపి అధినాయకత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విడివిడిగా నిర్వహించిన సమీక్షా సమావేశాలలో పార్టీ నాయకుల పని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోసహా తెలంగాణ నాయకులకు ఇప్పటికే అమిత్ షా క్లాసు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీచేసి విజయం సాధించని పక్షంలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

'వ్యాపమ్' సినిమాగా..

సమాజంలో పాతుకుపోయిన లోటు పాట్లనే కథా వస్తువులుగా మలచుకుని... ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా తెరకెక్కించడం ప్రకాశ్ ఝాకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో సందేహమేలేదు. ఆరక్షణ్, రాజనీతి, సత్యాగ్రహ, చక్రవ్యూహ్ వంటి సినిమాలను తెరకెక్కించి... విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రకాశ్ ఝా ప్రస్తుతం గంగాజల్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఇక మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తున్న ఈ డైనమిక్ డైరెక్టర్... పనిలో పనిగా ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న వ్యాపం స్కామ్ పైన దృష్టి సారించాడట.

రాజధాని భూముల్లో సాగు

ల్యాండ్‌ పూలింగ్‌లో భూములివ్వని నిడమర్రు పొలాల్లో విత్తనాలు వేసి సాగు పనులను సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ప్రారంభించారు. తొలుత నిడమర్రు గ్రామంలోనుండి పొలాల వరకు వైసిపి, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రత్నారెడ్డి పొలంలో ట్రాక్టర్‌తో దున్ని వరి విత్తనాలను చల్లారు. నీరుపెట్టి మట్టిని చదునుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు మాట్లాడు తూ జపాన్‌, సింగపూర్‌, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజ నాలు చేకూర్చి లబ్ధిపొందేందుకు టిడిపి ప్రయత్నిస్తుంద న్నారు. దానిలో భాగంగానే వేలాది ఎకరాల సమీకరించిం దన్నారు.

అఖిల భారత కిసాన్ సభ సర్వే

 దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండడంతో వారి బలవన్మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు సిపిఎం రైతు విభాగమైన అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ఒక సర్వే నిర్వహిస్తున్నది. దేశంలో గత రెండు దశాబ్దాలలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కిసాన్ సభ తెలిపింది. ‘రైతుల ఆత్మహత్యల పట్ల ఎఐకెఎస్ ఆందోళన చెందుతోంది. గత రెండు దశాబ్దాలలో సుమారు మూడు లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

పుష్కరాల్లో హెలీ టూరిసం

గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్‌ పుష్కర యాత్రికుల కోసం హెలీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకూ రాజమండ్రిలోని అన్ని పుష్కర ఘాట్లను ఆకాశమార్గాన హెలికాప్టర్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాల పిండివంటలతో ‘మెగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ’ నిర్వహిస్తున్నారు. తిరుపతిసహా రాష్ట్రంలోని 13 ప్రధాన ఆలయాల నమూనాలను రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇవి భక్తులను అలరించనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, సినీ సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు భక్తులను అలరించనున్నారు.

వ్యాపం లో మరో కోణం

వ్యాపం కుంభకోణాన్ని తానే తొలిసారిగా గుర్తించానని, ఆడ్మిషన్లు; రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే దర్యాప్తుకు ఆదేశించానని గొప్పలు చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు వ్యతిరేకంగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అసలు దర్యాప్తు ఆలస్యానికి ముఖ్యమంత్రే కారణమని రికార్డులు చూపిస్తున్నాయి. కుంభకోణం సంగతి సిఎంకు ముందే తెలుసని, ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన దర్యాప్తును ఆలస్యం చేశారని రికార్డులు చూపిస్తున్నాయి.

సోషలిజంతోనే సమస్యలు పరిష్కారం:పాటూరు రామయ్య

  ప్రజాసమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పేర్కొన్నారు. ఇందుకోసం ముందు నుంచి కృషి చేస్తున్న కమ్యూనిస్టు నాయకులను స్మరించు కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలో గుత్తిరామకృష్ణ అటువంటి మార్గదర్శ కుడే నని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ నిర్వహిం చింది.

Pages

Subscribe to RSS - July